న్యూఢిల్లీ : ఆఫీస్‌లకు వచ్చి వర్క్ చేస్తున్న ఉద్యోగులు కరోనా ముందు స్థాయికి చేరుకున్నారని టీసీఎస్ ప్రకటించింది. అనుకున్న దానికంటే ఎక్కువ టైమ్ పట్టిందని తెలిపింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మొదలు పెట్టిన 18 నెలల తర్వాత కరోనా ముందు స్థాయిలను అందుకున్నామని టీసీఎస్ హెచ్‌ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ అన్నారు. కంపెనీ ఉద్యోగులు సుమారు ఆరు లక్షల మంది ఉన్నారు.
వారంలో ఐదు రోజులు ఆఫీస్‌లలో పనిచేస్తున్నవారు గతంలో ప్రకటించిన దానికంటే 70 శాతం మంది ఎక్కువగా ఉన్నారని మిలంద్ పేర్కొన్నారు. కాగా, కరోనా సంక్షోభంతో మొత్తం ఐటీ ఇండస్ట్రీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని అందించింది. కానీ, ఆఫీసులలో పనిచేయడం ద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుందని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రమ్మంటున్నాయి.