ఇంజనీరింగ్ పూర్తయిన వారికి గుడ్ న్యూస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( టిసిఎస్ ) 2024లో BTech, BE, MCA, MSc , MS పూర్తయిన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోచ్చని ప్రకటించింది. ఏప్రిల్ 10 లోపు అప్లై చేసుకోవాలని.. ఏప్రిల్ 26న ఎగ్జామ్స్ ఉంటాయని కంపెనీ వెబ్‌సైట్ కెరీర్ పేజీలో తెలిపింది.అయితే జాబ్ వెకెన్సీలపై క్లారిటీ ఇవ్వలేదు.
అయితే కంపెనీ మూడు కేటగిరీల్లో ఉద్యోగాలు రిక్రూట్ మెంట్ చేస్తామని తెలిపింది. నింజా, డిజిటల్, ప్రైమ్ ల వారీగా నియామకాలు ఉంటాయని చెప్పింది. TCS అండర్ గ్రాడ్యుయేట్‌లకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు సంవత్సరానికి రూ. 11-12 లక్షల వరకు.. గరిష్టంగా రూ. 3-4 లక్షల వరకు ఉంటుంది.
నింజా కేటగిరిలో సంవత్సరానికి రూ. 3.36 లక్షల ప్యాకేజీ.. డిజిటల్ , ప్రైమ్ కేటగిరీల్లో సంవత్సరానికి రూ. 7 లక్షల నుంచి రూ. 9-11.5 లక్షల ప్యాకేజీలుగా ఉన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో TCS కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024 బ్యాచ్ కు ఆఫర్‌లను అందించినట్లు సమాచారం. ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం VIT వెల్లూరులో దాదాపు 10శాతం బ్యాచ్ (9,000 మంది విద్యార్థులు) TCS ఆధ్వర్యంలో ఉద్యోగాలు పొందారని తెలిపింది. మరో టెక్ దిగ్గజ సంస్థ ఫ్రెషర్స్ ను తీసుకునే విషయంపై ఎలాంటి ఆలోచన లేదని వెల్లడించింది.