టీసీఎస్ లాభం రూ.12,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌040 కోట్లు

టీసీఎస్ లాభం రూ.12,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌040 కోట్లు
  •  క్యూ1 లో రెవెన్యూ రూ. 62,613 కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ1) లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కు రూ. 12,040 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ. 11,070 కోట్ల ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  8.7 శాతం పెరిగింది. కంపెనీ రెవెన్యూ 5.4 శాతం వృద్ధి చెంది రూ.62,613 కోట్లకు చేరుకుంది.  మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే రెవెన్యూ 2.2 శాతం పెరగగా,   నికర లాభం  మాత్రం 3.1 శాతం తగ్గింది.

రూ. 1 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో షేరుపై రూ. 10 ఇంటెరిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిడెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ ప్రకటించింది.  టీసీఎస్ షేర్లు  గురువారం రూ.3,902 దగ్గర ముగిశాయి. ఆర్థిక సంవత్సరాన్ని గొప్పగా మొదలు పెట్టామని కంపెనీ సీఈఓ కే కృతివాసన్  అన్నారు. అన్ని సెగ్మెంట్లలో వృద్ధి నమోదు చేశామని పేర్కొన్నారు. టీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐఓటీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్నోవేషన్ హబ్‌  పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసిందని, లాటిన్ అమెరికా, కెనడా, యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో  డెలివరీ సెంటర్లను విస్తరించిందని చెప్పారు. ఉద్యోగుల శాలరీస్ పెంచినప్పటికీ  జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగుపడ్డాయని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శేక్సారియా అన్నారు.