న్యూఢిల్లీ : ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ వైజాగ్లో కొత్త ఫెసిలిటీని ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. దీనివల్ల 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ విషయమై టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్తో ముంబైలో చర్చించానని అన్నారు.
తమ రాష్ట్రంలో ఐటీ, ఇతర రంగాల్లోని అవకాశాలు, అభివృద్ధి గురించి వివరించానన్నారు.