శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనానికి తత్కాల్ బుకింగ్ సదుపాయం

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనానికి తత్కాల్ బుకింగ్ సదుపాయం

శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీజన్‌లో తీర్థయాత్ర సాఫీగా సాగేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. స్వామి వారి దర్శనానికి స్పాట్ బుకింగ్ సదుపాయానికి బదులుగా రైల్వే తరహా 'తత్కాల్' మోడల్‌ అమలు చేయాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. విజయవంతమైతే, తదుపరి మండల సీజన్ నుండి స్పాట్ బుకింగ్ సేవలు రద్దు చేసి 'తత్కాల్' మోడల్‌ కొనసాగించనుంది.

తత్కాల్ సదుపాయం ద్వారా ప్రయాణీకులు చివరి నిమిషంలో రిజర్వేషన్ చేసుకోవడానికి రైల్వే శాఖ ఎలా అనుమతిస్తుందో.. అలావర్చువల్-క్యూ సౌకర్యం కింద స్లాట్ల కోటా చివరి నిమిషంలో 'తత్కాల్' సదుపాయం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ల సంఖ్య తర్వాత ఖరారు చేస్తారు. ఈ సేవలు ప్రస్తుతానికి ఉచితం అయినప్పటికీ, భవిష్యత్తులో రూ. 10 రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

వారపు రోజులలో నిమిషానికి 65 మంది..

వారపు రోజులలో, శుక్రవారం మినహా యాత్రికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు.. సగటున 65 మంది యాత్రికులు పవిత్రమైన 18 మెట్ల గుండా ఆలయానికి చేరుకోవడానికి అనుమతించనున్నారు. రద్దీగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో 80 మందికి అనుమతి ఉంటుంది. కాగా, దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించేందుకు అక్టోబర్ 29(సోమవారం) కమిటీ సమావేశం నిర్వహించనుంది.

ALSO READ | ఆధ్యాత్మికం: ఇంట్లో పూజ చేసినా.. గుడికి ఎందుకు వెళ్లాలో తెలుసా..