
హైదరాబాద్, వెలుగు: ఓపెనర్ మహేశ్ జాదవ్ (101 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటడంతో ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అండర్17 టీ20 టోర్నమెంట్‌లో తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) ఎలెవన్ విజేతగా నిలిచింది.
టీడీసీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఫైనల్లో 13 రన్స్ తేడాతో మహబూబ్‌నగర్‌ను ఓడించింది. తొలుత టీడీసీఏ ఎలెవన్ 20 ఓవర్లలో182/4 స్కోరు చేసింది. మహేశ్‌తో పాటు శివశంకర్ (52) రాణించాడు. ఛేజింగ్‌లో మహబూబ్‌నగర్ టీమ్ 19.3 ఓవర్లలో 169 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్ సంజు (41) పోరాడాడు. టీడీసీఏ బౌలర్లలో దీక్షిత్ 3, అరుణ్, మహేశ్ చెరో రెండు వికెట్లు తీశారు. మహేశ్ జాదవ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. టీడీసీఏ ప్రెసిడెంట్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎన్నారై డాక్టర్. టి సత్యనారాయణ రెడ్డితో కలిసి విజేతలకు ట్రోఫీ అందజేశారు.