యాదగిరిగుట్ట, వెలుగు: ఆలేరు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన బీర్ల అయిలయ్యకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని టీడీపీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి రేగు బాలనర్సయ్య డిమాండ్ చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ.. 30 ఏళ్ల నుంచి ఆలేరు ప్రాంతం మంత్రిత్వ శాఖకు నోచుకోలేదన్నారు.
మోత్కుపల్లి నర్సింహులు తర్వాత ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం రాలేదని వాపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బీర్ల అయిలయ్యకు మంత్రిగా అవకాశం ఇస్తే నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మంగళగిరి రవిచందర్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కళ్లెం బాబురావు గౌడ్, నేతలు చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్, గుర్రం బాలస్వామి, ఎడపల్లి సత్తయ్య, రాజశేఖర్, పోచయ్య, శ్రీనివాస్, కుమార్, మల్లేశ్, శంకర్, ఆదర్శ్ ఉన్నారు.