ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి సి.రామచంద్రయ్య జనసేన అభ్యర్థి హరి ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నామినేషన్ల ఉప సంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది.ప్రతిపక్ష వైసీపీ నుండి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో కూటమి అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
కేవలం సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి విజయ రాజు ప్రకటించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ వనితా రాణి పాల్గొన్నారు.సి. రామచంద్రయ్య టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల 13నుండి 12తగ్గింది. టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్య 6కు పెరిగింది.హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ఎన్నికవ్వటంతో జనసేన మండలిలో ఖాతా తెరిచినట్లయ్యింది.