వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కి ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆయనకు ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది టీడీపీ. అయితే, నరసాపురం నుండి ఎంపీగా పోటీ చేయాలన్న రఘురామ పంతం నెరవేరలేదు. నరసాపురం ఎంపీ స్థానాన్ని టీడీపీకి ఇవ్వవటానికి బీజేపీ ఒప్పుకోకపోవటంతో కాంప్రమైజ్ కాక తప్పలేదు.
టీడీపీ గట్టి పట్టున్న ఉండి నియోజకవర్గం నుండి రఘురామ పోటీ చేయటం అటు టీడీపీకి, ఇటు రఘురామకు కలిసొస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించే విషయంలో చంద్రబాబు బీజేపీ పెద్దలతో చేసిన చర్చలు ఫలించలేదు. ఏలూరు ఎంపీ స్థానం విషయంలో సుముఖత చూపని బీజేపీ అధిష్టానం వైజాగ్ సీటు కోరగా రఘురామ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మరి, ఉండి నుండి పోటీ చేస్తున్న రఘురామ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాడా లేదా చూడాలి.