పల్నాడులో విధ్వంసం : గురజాలలో వైసీపీ నేతలపై టీడీపీ వర్గం దాడులు

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. మాచవరం మండలంలో వైసీపీ నాయకులుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. మాచవరం మండల వైసీపీ అధ్యక్షుడు చౌదరి సింగరయ్యపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. మాచవరం తాసిల్దార్ కార్యాలయం వద్ద కారు ఎక్కుతుండగా దాడి టీడీపీ నాయకులు దాడి చేశారు. ఘటనలో వైసీపీ నాయకులు ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.

కారును పూర్తిగా ద్వంసం చేశారు టీడీపీ నేతలు. చౌదరి సింగరయ్యను డుగురాళ్ల పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో చౌదరి సింగరయ్యకు కాళ్లు చేతులు విరిగిపోయాయినట్టు సమాచారం. మరో నాయకుడు దారం లక్ష్మిరెడ్డికి చేయి విరిగినట్టు తెలుస్తుంది. హై టెన్షన్స్ నడుస్తున్న సమయంలో పోలీస్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.  

 జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్టు జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగిన ఉపేక్షించేది లేదని తెలిపారు. ఉద్రిక్తత కొనసాగుతున్నందున 144 సెక్షన్ అమలు చేసినట్టు వెల్లిడించారు.