
ఉపరాష్ట్రపతి వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ సభ్యుల వినతి
టీడీపీ లెజిస్లేటివ్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని తీర్మానం చేశారు ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు. తీర్మానం చేసిన లేఖను ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడుకు అందజేశారు టీడీపీ ఎంపీలు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పాల్గొన్నారు.
సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు లు మీడియాతో మాట్లాడారు. తాము ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంతో తాము ప్రేరణ పొందామని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. ఇకపై తమను బీజేపీ ఎంపీలుగా గుర్తించాలని కోరారు. తమ నిర్ణయాన్ని అంగీకరించాలని బీజేపీ చీఫ్ కు, రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాశారు.