NDA కూటమిలో కీలకం కానున్న నితీష్, చంద్రబాబు

లోక్ సభ ఎన్నికలు 2024 ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు కాస్త భిన్నంగా వస్తున్నాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు ఎన్డీయే 300లకు పైగా పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటాయని తెలిపాయి. రిజల్ట్స్ డే రోజు రోజు ఎన్డీయేకు గట్టి ఇండియా కూటమి గట్టి పోటి ఇస్తోంది. ప్రస్తుతం బీజేపీ సొంతంగా 272 సీట్లను గెలుచుకోవడం కష్టంగా మారింది. ఈ ఎన్డీయే కుటమికి నార్త్ ఇండియాలో ఈ సారి ఆశించిన ఫలితాలు రాలే.. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రద్రేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీ అనుకున్న సీట్లు రావడంలేదు. 

దీంతో బీహార్ లో జేడీయూ నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ చంద్రబాబు ఎన్డీయే కుటమిలో కీ రోల్ కానున్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి 20 స్థానాలు, బీహార్ లో జేడీయూ 14 స్థానాలు బీజేపీని గట్టేక్కిస్తాయని భావిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతీయ పార్టీ నాయకులకు కూటమిలో గట్టి డిమాండ్ యే ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా బీజేపీకి మంచి ఫలితాలే వస్తున్నాయి. అటు ఇండియా కూటమి కూడా 230 పార్లమెంట స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో అధికార పోరు హోరాహోరిగా జరగనుంది.