
హైదరాబాద్, వెలుగు: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఏకే. గంగాధర్ రావు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మెదక్ నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు మైనం పల్లి రాధాకిషన్ రావు, రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ ఏకే. రమేశ్ చందర్ కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. వీరందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.