
ఆంధ్ర ప్రదేశ్: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిల ప్రియ. కర్నూలు టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో భేటీ అవడానికి వెళ్లగా… రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తన అభిప్రాయాన్ని తెలపాలని కోరారు. కర్నూలులో హైకోర్టును తాను స్వాగతిస్తున్నానని.. దీంతో పాటు.. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధికి ఊతమిచ్చే పనులు, రైతులు వలసలు పోకుండా చర్యలు, చేపట్టాలని సీఎం జగన్ ను కోరే దమ్ముందానని జేఏసీ నాయకులను ప్రశ్నించారు అఖిల ప్రియ. రాయలసీమలో అన్నిరకాల అభివృద్ధి అవసరమని… ముందుగా ముఖ్యమంత్రే స్పష్టత ఇవ్వాలని జేఏసీ నేతలకు చెప్పారు. చంద్రబాబు కూడా డా.దార్ల సీమలో అభివృద్ధి పనులు చేశారని దీనిని గమనించాలన్నారు అఖిలప్రియ.