తిరుపతిలో ఏనుగుల బీభత్సం.. టీడీపీ నేత మృతి

తిరుపతిలో దారుణం జరిగింది.. జిల్లాలోని చంద్రగిరిలో ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఆదివారం ( జనవరి 19, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. పంట పొలాలలో ఏనుగులు సంచరిస్తుండటంతో రాకేష్ చౌదరి అనే వ్యక్తి  వాటిని తరిమేందుకు మరొకరితో కలిసి పొలం దగ్గరకు వెళ్లారు. ఏనుగులను తరిమే క్రమంలో ఏనుగులు వీరిపై దాడి చేయడంతో ఒకరు చెట్టు పైకి ఎక్కగా రాకేష్ పరుగులు తీశాడు. తెల్ల చొక్కా వేసుకోవడంతో అతనిని వెంబడించాయి. ఏనుగుల దాడిలో అక్కడికక్కడే రాకేష్ చౌదరి మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతి చెందిన రాకేష్ నారావారి పల్లి ఉపసర్పంచ్ గా, జిల్లా ఐటీడీపీ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

రాకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాకెష్ మృతి పట్ల స్థానికులు సమాచారం అందించటంతో హుటాహుటిన ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఎమ్మెల్యే పులవర్తి నాని. అధికారులను, కార్యకర్తలను అప్రమత్తం చేశారు. అధికారులను,నాయకులను అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు ఎమ్మెల్యే. రాకేష్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే  కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.