టీడీపీ నేత తుపాకీతో వీరంగం సృష్టించిన ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ కుటుంబసభ్యులపై టీడీపీ నేత తుపాకీ గురి పెట్టాడు.
రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి చెందిన టీడీపీ నేత గంగాధర్.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళను లైంగికంగా వేధించాడు. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోవాలని గంగాధర్.. మహిళ కుటుంబసభ్యులకు సూచించాడు. కాదన్నందుకు వారిపై తుపాకీ గురి పెట్టాడు. అతని చేష్టలతో విసుగుచెందిన ఇరుగు పొరుగు నిందితున్ని పట్టుకొని చావ బాదారు. బెదిరింపులకు పాల్పడిన గంగాధర్ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుడని గ్రామస్థులు చెప్తున్నారు.
మహిళకు లైంగిక వేధింపులు.. కుటుంబసభ్యులపై తుపాకీ గురిపెట్టిన టీడీపీ నేత#SriSathyaSaiDistrict #ParitalaSunitha #Raptadu pic.twitter.com/rAwd3ArPKK
— Govardhan Reddy Dasari (@SportsNewsInd24) September 10, 2024