కొండలమ్మ ఆలయానికి సీసీ రోడ్డు వేయండి : టీడీపీ నాయకులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో కొండలమ్మ గుట్టపై కొలువైన కొండలమ్మ తల్లి ఆలయానికి సీసీ రోడ్డు వేయాలని  టీడీపీ నాయకులు కోరారు. ఆదివారం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  కొండలమ్మ  అమ్మవారి దేవాలయానికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

బోనాల పండుగ సమయంలో మహిళల బాధలు వర్ణనాతీతమని వివరించారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సీసీ రోడ్డు కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కళ్లెం బాబురావు గౌడ్, టీడీపీ సీనియర్ నాయకులు గొట్టిపర్తి మల్లేశం గౌడ్, బండకింది కృష్ణ గౌడ్ ఉన్నారు.