ఖమ్మం, వెలుగు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజును మంగళవారం ఖమ్మం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సిటీలోని జల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జ్కూరపాటి వెంకటేశ్వర్లు, సిటీ అధ్యక్షుడు వడ్డెం విజయ్, నాయకులు గుత్తా సీతయ్య, నాగండ్ల మురళి, సానబోయిన శ్రీనివాస్ గౌడ్, ప్యారిస్ వెంకన్న, నాగేశ్వరావు, మేకల సత్యవతి, నల్లమల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.