ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వానికి తెర పడింది. ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ ఆఫీస్ ను క్యాంపు కార్యాలయంగా వాడుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు టీడీపీ నేతలు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు తెలిపిన పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్లో పెకొన్నారు.ఈ నేపథ్యంలో ఆధారాలతో తెదేపా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆర్వో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.