టీడీపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇదే

టీడీపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇదే

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి టీడీపీ మెనిఫెస్టో విడుదల చేసింది. మీభవిష్యత్తు నా బాధ్యత అనే పేరుతో మెనిఫెస్టోను రిలీజ్ చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మొదట విజయవాడ దుర్గమ్మను దర్శంచుకుని మెనిఫెస్టోకు పూజలు చేయించారు. ఆతర్వాత ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. మోనిఫెస్టో ను విడుదల చేసిన తర్వాత.. రైతులకు, మహిళలకు, పెద్దపీట వేసినట్టు తెలిపారు, ఇంటర్ పాసైన వారికి నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పారు.

గత ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్నారు చంద్రబాబు. 24వేల 500 కోట్లతో రైతుల రుణమాఫీ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకంతో 60లక్షల మందికి లబ్ది కలుగుతోందన్నారు. ఒక్కో డ్వాక్రా మహిళకు 20వేలు ఇచ్చామన్నారు. ఐదేళ్లలో సంక్షేమం కోసం లక్ష కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోను 100శాతం నెరవేర్చామని చెప్పారు. ప్రజాదరణ, రెట్టించిన స్ఫూర్తితో 2019ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశామన్నారు. 150కి పైగా సీట్లలో టీడీపీ గెలుపు తథ్యమన్నారు. ప్రతీ పేద కుటుంబానికి 20వేలు ఆదాయం కలిగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పింఛను అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. అలాగే పింఛను 2వేల నుంచి 3వేలకు పెంచుతామన్నారు. చంద్రన్న పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందిస్తామన్నారు. 20వేల జనాభా దాటిన మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు తెరుస్తామన్నారు. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామన్నారు. ఎస్సీలకు 100, ఎస్టీలకు 50 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.

మెనిఫెస్టోలో మేయిన్ పాయింట్స్:
ప్రతీ సంవత్సరం ఉద్యోగాలను భర్తీ చేస్తాం

ఇంటర్‌ పాసైన వారికి నిరుద్యోగ భృతి

రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్‌

రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చూస్తాం

గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడికి రాయితీలు ఇస్తాం

ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తాం

నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతాం.

అన్నదాతా సుఖీభవ పథకం ఐదేళ్లు అమలు

రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం

రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి.

రైతులకు లాభసాటి ధరలు లభించేలా చర్యలు చేపడతాం

ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్లు సరఫరాకు ప్రత్యేక చర్యలు

40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరింపు

మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్పింక్లర్‌  వ్యవస్థల ఏర్పాటు

కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు