టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో..

టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అక్రమ సంబంధాలు, రాసలీలల చుట్టూ తిరుగుతున్నాయి... మొన్న వెలుగులోకి వచ్చిన వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం మరువక ముందే..  తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో రాసలీలల్లో పాల్గొంటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డారంటూ  ఆదిమూలంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన పైన ఒత్తిడి తెచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. వైరల్ గా మారిన ఈ వీడియోపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తమ పార్టీ నాయకులే తనపై కుట్ర చేశారంటూ చెప్పుకొచ్చారు. సదరు మహిళతో తనకు ఏ సంబంధం లేదని,ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోందని అన్నారు. తానేంటో, తన పనితనం ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు ఆదిమూలం.