
ఏపీ అసెంబ్లీలో రెండో రోజూ గందరగోళం కొనసాగుతోంది. మొదటిరోజు తొడ కొట్టి, మీసం మెలేసి ఛాలెంజ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. రెండో రోజు విజిల్స్ ఊదుతూ కనిపించారు. రెండో రోజూ శాసనసభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు తమ నిరసనలు ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యులు ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read :- హైదరాబాద్ లో కుండపోత వాన.. సెప్టెంబర్ 28 వరకు భారీ వర్షాలు
ఈ క్రమంలోనే సభా కార్యక్రమాలను వీడియో తీస్తున్నారని చీఫ్ విప్ ప్రసాదరాజు స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, ఆశోక్ లను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఇదే సమయంలో టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తూ నిరసనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి విజిల్ ఊదుతూ నిరసనకు దిగారు.