ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాలనాపరమైన ప్రక్షాళన లక్ష్యంగా సంచలన నిర్ణయాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను సరిచేసే దిశగా అడుగులేస్తోంది చంద్రబాబు సర్కార్.ఇదిలా ఉండగా చాలా చోట్ల టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా.. సీఎం చంద్రబాబుతో మాట్లాడి పేకాట ఆడించేందుకు కృషి చేస్తానంటూ.. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మంచి మంచి కట్టుబాట్లు...
— Jagananna Connects (@JaganannaCNCTS) July 30, 2024
చంద్రబాబుతో మాట్లాడి పేకాట క్లబ్లు తెరిపిస్తా
- టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్#AndhraPradesh #SaveAPFromTDP pic.twitter.com/8iy7dDxFyN
రాష్ట్రంలో పేకాట బ్యాన్ చేసి 4, 5ఏళ్ళు అవుతోందని, చంద్రబాబుతో మాట్లాడి అనంతపురంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో కూడా పేకాట ఆడించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ప్రతిపక్ష వైసీపీ ఈ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ చేస్తోంది. తమ అధినేత జగన్ పేకాటను బ్యాన్ చేసి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చేస్తే, చంద్రబాబు సర్కార్ వచ్చాక రాష్ట్రం మళ్ళీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోందని ఆరోపిస్తున్నారు.