
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి .. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన కామెంట్ చేశారు. మరో మూడేళ్ల తరువాత అధికారంలోకి వస్తానని జగన్ చెబుతున్నారని... కాని ఆయన వచ్చేది అధికారంలోకి కాదని... రాజమండ్రి సెంట్రల్ జైలుకు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కించాల్సిందేనన్నారు. లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయన్న గోరంట్ల... జగన్ హయాంలో పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులు వేల కోట్ల నష్టపోయారన్నారు.
Also Read:-10 రోజుల్లోనే 16 వేలతో డీఎస్సీ నోటిఫికేషన్..
గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదని .. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రజలను ఆదుకుంటున్నామని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. మేలో తల్లికి వందనం.. జూన్ లో అన్నదాత సుఖీభవ పథకాలను అమల చేయబోతున్నామన్నారు. రాజమండ్రిలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో చర్చించామన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల సమయానికి రాజమండ్రి చుట్టు పక్కల అభివృద్ది చేందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.