రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా : మీడియాకు టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్

రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా : మీడియాకు టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్

రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా.. ఈ మాట అన్నది ఏ రౌడీనో గుండానో కాదు, సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే.. అవును, అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఓ మీటింగ్ లో మీడియా సాక్షిగా మాట్లాడిన మాటలివి. బుధవారం ( జనవరి 29, 2025 ) ఓ మీటింగ్ లో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఈమేరకు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.మీడియా అంటే తనకు లెక్కలేదని.. అన్ని చూసి వచ్చినోన్ని అని అన్నారు. ఏం రాసుకుంటారో రాసుకోండి అంటూ రెచ్చిపోయారు జయరాం. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానని అన్నారు జయరాం.

తప్పు చేస్తే రాయాలని... ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తానని అన్నారు. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని.. తన కుటుంబ పెత్తనం ఉందని ఆరోపిస్తున్నారని..  భూ అక్రమాలు చేశానని అంటున్నారని.. వీటన్నింటినీ నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానని అన్నారు జయరాం.