దైవ సన్నిధిలో మరణించడం అదృష్టం.. టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు సంచలన వ్యాఖ్యలు..

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాట ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దైవ సన్నిధిలో అసువులు బాసటం ఒకరకంగా అదృష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్యోతుల నెహ్రు. 

విశాఖలో మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేసేందుకు వెళ్లిన జ్యోతుల నెహ్రు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవ సన్నిధిలో మరణించడం ఒకరకంగా అదృష్టమని.. ముక్తి కోసం చాలామంది మరణిస్తుంటారని అన్నారు నెహ్రు. హోంమంత్రి అనిత, టీటీడీ సభ్యుల సమక్షంలో నెహ్రు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి.

Also Read : తిరుమలలో లడ్డూ కౌంటర్లో మంటలు

తొక్కిసలాటలో కుటుంబ సభ్యులను కోల్పోయిన విషాదంలో ఉంటే.. చనిపోవడం అదృష్టమంటూ అనడం ఎంతవరకు సమంజసం అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా...తొక్కిసలాటలో మరణించినవారి  కుటుంబాలకు టీటీడీ రూ.25 లక్షలు పరిహారం ప్రకటించింది టీటీడీ . అంతే కాకుండా కుటుంబంలో ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇస్తామని.. చెక్కులను యుద్ధప్రాతిపదకన పంపిణీ చేయాలని ఆదేశిచారు సీఎం చంద్రబాబు.