ESI స్కామ్ లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్

ఏపీ రాజకీయాల్లో మరో కుదుపు చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ లీడర్ కింజారపు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఈఎస్ఐ స్కామ్ విషయంలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే ఈఎస్ఐలో కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ. 150 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. పూర్తిగా నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. కొనుగోళ్ల టెండర్లలో మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ కేసు విషయంలో ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ స్కాంకు సంబంధించి మరో మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడిని టెక్కలిలోని నిమ్మాడ వద్ద ఉదయం 6:45కు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. దాదాపు 100 మంది పోలీసుల భద్రత మధ్య ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.

For More News..

జనాలకే కరోనా రూల్స్.. లీడర్లకు కాదు..

డ్యూటీకి రాకపోతే ఫైన్!