టీడీపీ ఎమ్మెల్యే నాపై లైంగిక దాడి చేశాడు : వరలక్ష్మి

టీడీపీ ఎమ్మెల్యే నాపై లైంగిక దాడి చేశాడు :  వరలక్ష్మి
  • బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నడు

ఖైరతాబాద్, వెలుగు: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సత్యవేడు నియోకవర్గం టీడీపీ అధ్యక్షురాలు ఎ. వరలక్ష్మి (36) ఆరోపించింది. అంతేకాకుండా బ్లాక్​ మొయిల్​ చేస్తూ తనను శారీరకంగా  లోబర్చుకున్నాడని ఆమె పేర్కొంది. గురువారం హైదరాబాద్ లో ప్రెస్​క్లబ్​లో  ఆమె మాట్లాడారు. ‘‘తాను చెప్పిన మాట వినకుంటే నా  కుటుంబాన్ని చంపుతానని ఎమ్మెల్యే బెదిరించాడు. దాంతో ఆయన చెప్పినట్లు వినవలసి వచ్చింది. ఆదిమూలం వైసీపీలో ఉన్నపుడు అతని అవినీతిపై ప్రశ్నించినందుకు నాపై కక్షకట్టాడు.

నాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శారీరకంగా కలవాలని ఒత్తిడి చేశాడు. దాంతో అతను చెప్పినట్లు ఈ ఏడాది జులై 6న తిరుపతిలోని ఓ లాడ్జికి వెళ్లాను. మళ్లీ అదే నెల 17న అదే లాడ్జికి రమ్మని చెప్పాడు. మధ్యాహ్నం 3 గంటలకు వెళినపుడు నాపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత రోజూ అర్ధరాత్రి ఫోన్  చేస్తూ  రమ్మని టార్చర్ ​ చేశాడు” అని వరలక్ష్మి పేర్కొంది.  ఈ విషయం తన భర్త గ్రహించి ఎమ్మెల్యేతో అర్ధరాత్రి ఫోన్లేంటి అని నిలదీస్తే జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పానని తెలిపింది. తన భర్త సూచన మేరకు మళ్లీ జులై 10న మధ్యాహ్నం 1.30 గంటలకు ఆదిమూలం వద్దకు పెన్​ కెమెరాతో వెళ్లి, అతను చేసిన కామక్రీడలను రికార్డు చేశానని తెలిపింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

పార్టీ మహిళా కార్యకర్తపై లైంగిక దాడికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెన్షన్  చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్  పల్లా శ్రీనివాస రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.  కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించాడని, లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి అతడిని సస్పెండ్  చేశామని ఆ ప్రకటనలో  ఆయన పేర్కొన్నారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా ముందు సస్పెండ్  చేసి తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్  నిర్ణయించిందని తెలిపారు.