![విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బిగ్ ట్విస్ట్... చంద్రబాబు అనూహ్య నిర్ణయం...](https://static.v6velugu.com/uploads/2024/08/tdp-not-contesting-in-vizag-mlc-bi-elections_DbzKuv7Z5y.jpg)
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్నికల బరిలోనుండి తప్పుకోవాలని సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టెలీకాన్ఫరెన్స్‌లో తన అభిప్రాయాన్ని కూటమి నేతలకు తెలిపారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు అత్యంత హుందాగా వ్యవహరించారన్న కూటమి నేతలు కితాబిస్తున్నారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
గత కొన్ని రోజులుగా టీడీపీ తరఫున బైరా దిలీప్ చక్రవర్తి బరిలో దిగుతారని వార్తలున్నప్పటికీ చంద్రబాబు తాజా నిర్ణయం,ఎంతో వాటికి చెక్ పడింది. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక లాంఛనం అయ్యిందనే చెప్పాలి. స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ కూడా పోటీ నుండి ఉపసంహరించుకుంటే ఇక బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.