- స్టేట్ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న ఖమ్మంలోని సర్దార్‌పటేల్ స్టేడియంలో నిర్వహించనున్న టీడీపీ సభను సక్సెస్ చేయాలని ఆ పార్టీ స్టేట్ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కాసాని మీడియాతో మాట్లాడారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం హైదరాబాద్ నుంచి బయలు దేరి.. పాలేరు నియోజకవర్గంలోని కేశవపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అక్కడి నుంచి ఖమ్మంలోని పాత బస్టాండ్ మీదుగా సర్దార్ పటేల్ స్టేడియం వరకు ర్యాలీగా వెళతారని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ ఉంటుందన్నారు. రాత్రి 8.30 గంట లకు పాతర్లపాడులోనూ చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.