2024 ఎన్నికల్లో సీఎం జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీలో రగులుతున్న అసమ్మతి తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు సీట్లు కేటాయించిన నియోజకవర్గాల్లో సీటు ఆశించిన టీడీపీ నేతలు కొంతమంది పార్టీ మారుతుండగా మరికొంతమంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా సీనియర్ నాయకులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన టీడీపీ వర్క్ షాప్ కి దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావులు డుమ్మా కొట్టారు. వీరితో పాటు కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణ, ఆలపాటి రాజా వర్క్ షాప్ కి హాజరు కాలేదు. ఈ వర్క్ షాప్ కి గైర్హాజరైన సీనియర్ నాయకులందరికీ వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయించకపోవటం గమనార్హం. మరి, చంద్రబాబుకు షాకిచ్చిన ఈ నేతలు పార్టీ మారతారా లేక టీడీపీలోనే కొనసాగుతారా అన్నది వేచి చూడాలి.