భద్రాచలం, వెలుగు : ఎన్డీయే భాగస్వామి అయిన టీడీపీ మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని భద్రాచలం నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి పోరిక బలరాంనాయక్కే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నాయకులు శుక్రవారం పోరిక బలరాం నాయక్‌కు మద్దతుగా భద్రాచలంలో ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే డాక్టర్తెల్లం వెంకట్రావుతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కాగా పోరిక బలరాం నాయక్ విజయాన్నికాంక్షిస్తూ భద్రాచలంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.