చంద్రబాబు విక్టరీ.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫ్యామిలీ

ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. టీడీపీ 135 జనసేన 21 బీజేపీ  7 సీట్లతో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికార వైసీపీ మాత్రం ఘోర పరాజయంకు అడుగులు వేస్తుంది. 175 సీట్లకు పోటీ చేసిన వైసీపీ 12 స్థానాల్లోనే తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో ఏపీలో ప్రభుత్వం మారినట్టుగానే ఫలితాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. విక్టరీ సింబల్ చూపిస్తూ ఫోటోలను వదిలారు. కేక్ కట్ చేసి విజాయాన్ని పంచుకున్నారు. ఏపీలోని అన్ని టీడీపీ కార్యాలయాల వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.