టీడీపీ ఆఫీస్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎంపీ నామా

టీడీపీ ఆఫీస్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎంపీ  నామా

ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. నామా నాగేశ్వరావు టీడీపీ  కార్యాలయానికి వెళ్లి పార్టీ శ్రేణులను ఓట్లు అభ్యర్ధించారు. దీంతో కొందరు టీడీపీ శ్రేణులు బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.  కేసీఆర్ టీడీపీని  నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామా టీడీపీ కార్యాలయానికి రావడాన్ని నిరసిస్తూ చెప్పులతో నిరసన తెలిపారు. 

 నామా నాగేశ్వర్ రావు ఖమ్మం ఎంపీగా  బీఆర్ఎస్  నుంచి పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాఘురాం రెడ్డి బరిలోకి దిగుతున్నారు.బీజేపీ నుంచి వినోద్ రావు పోటీచేస్తున్నారు.