
న్యూఢిల్లీ: ఇంటి అద్దె ఏడాదికి రూ. ఆరు లక్షల పైనుంటేనే ఇక నుంచి ఎట్సోర్స్(టీడీఎస్) పడనుంది. రూ.2.4 లక్షల నుంచి రూ.ఆరు లక్షలకు లిమిట్ పెంచుతామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. తక్కువ మొత్తం అద్దెలు వచ్చే చిన్న పన్ను చెల్లింపుదారులకు దీంతో మేలు జరుగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ప్రకటించారు.
టీడీఎస్ ట్రాన్సాక్షన్లూ తగ్గుతాయన్నారు. ఇక నుంచి ఏడాదికి రూ.2.4 లక్షల కంటే ఎక్కువ అద్దె పొందేవాళ్లు టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. నెలకు రూ.50 వేలకు మించి అద్దె ఆదాయం ఉంటే టీడీఎస్ కట్టాలి.