టీడీఎస్‌‌‌‌ రిటర్న్‌‌‌‌ ఫైల్ చేయలేదా..? లేటుగా ఫైల్ చేస్తే..

టీడీఎస్‌‌‌‌ రిటర్న్‌‌‌‌ ఫైల్ చేయలేదా..? లేటుగా ఫైల్ చేస్తే..
  • అదనంగా లేటు ఫీజూ కట్టాల్సిందే..


బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఉద్యోగులకు ఇచ్చే శాలరీలోనే టీడీఎస్‌‌‌‌ను ఎంప్లాయర్లు (ఉద్యోగం ఇచ్చిన వారు), ఆర్గనైజేషన్లు కట్ చేసుకుంటాయి. క్వార్టర్లీ టీడీఎస్ రిటర్న్‌‌‌‌ను ఫైల్ చేసే బాధ్యత కూడా వీటి పైనే ఉంటుంది. కానీ,ఇండివిడ్యువల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌పేయర్లు మాత్రం టీడీఎస్‌‌‌‌ రిటర్న్‌‌‌‌ను వీలున్నంత తొందరగా ఫైల్ చేసుకోవాలి. లేకపోతే ఎన్ని రోజులు లేట్ అయితే రోజుకి రూ. 200 చొప్పున లేట్ ఫీజు పడుతుంది.

ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌–జూన్‌‌‌‌కు సంబంధించి క్వార్టర్లీ టీడీఎస్ రిటర్న్‌‌‌‌ను జులై   31 లోపు ఫైల్ చేయాలి. ఆ తర్వాత ఫైల్ చేయాలనుకుంటే ఎన్ని రోజులు లేట్ అయ్యారో చూసి రోజుకి రూ. 200 చొప్పున ముందుగానే లేట్‌ ఫీజుని ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కట్టించుకుంటుంది. వీటికి అదనంగా  కనీసం రూ. 10 వేలను పెనాల్టీ కింద కట్టమని అసెసింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ అడగొచ్చు.

ఈ నెంబర్ గరిష్టంగా రూ. లక్ష వరకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కొన్ని సార్లు టీడీఎస్ రిటర్న్‌‌‌‌లు లేట్‌‌‌‌గా ఫైల్ అవ్వడం వలన రిఫండ్ కావాల్సిన అమౌంట్‌‌‌‌ను కూడా ట్యాక్స్‌‌‌‌పేయర్లు వదిలేసుకోవాల్సి వస్తుంది. పెనాల్టీలు, లేట్‌‌‌‌ ఫీజుల నుంచి తప్పించుకోవాలంటే  డెడ్‌‌‌‌లైన్‌‌‌‌లోపే టీడీఎస్ రిటర్న్‌‌‌‌ను ఫైల్ చేసుకోవాలి. ఏప్రిల్‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌గాను టీడీఎస్‌‌‌‌ రిటర్న్‌‌‌‌ ఫైల్ చేయడానికి జులై 31 చివరి తేది. జులై–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌కి గాను ఫైల్ చేయడానికి అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 31 చివరి తేది. 

టీడీఎస్‌‌‌‌ అంటే..

ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌లో ఒక భాగమే టీడీఎస్‌‌‌‌. ట్యాక్స్‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌ వరకు వెయిట్ చేయకుండా సోర్స్ వద్దనే ట్యాక్స్‌‌‌‌ను డిడక్ట్ చేసుకోవడాన్ని టీడీఎస్ అంటారు. ఉదాహరణకు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే శాలరీ (అర్హులైన వారి) నుంచి టీడీఎస్‌‌‌‌ కట్ చేసుకుంటాయి. ఈ ట్యాక్స్ అమౌంట్‌‌‌‌ను సెంట్రల్ గవర్నమెంట్‌‌‌‌ అకౌంట్‌‌‌‌కు పంపుతాయి.

ఆ ఉద్యోగి తన ట్యాక్స్ లయబిలిటీస్‌‌‌‌ను లెక్కించేటప్పుడు మొత్తం గ్రాస్ శాలరీని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికే కట్టేసిన టీడీఎస్‌‌‌‌ను డిడక్షన్‌గా పొందుతాడు. టీడీఎస్‌‌‌‌  రిటర్న్‌ కోసం ట్యాక్స్‌‌‌‌పేయర్లు తమ ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌ నుంచి 16 లేదా 16 ఏ  ఫామ్‌‌‌‌లను పొందాలి.  ఉద్యోగికి బదులు ఎంప్లాయర్లు టీడీఎస్‌‌‌‌ను కట్‌‌‌‌ చేసుకున్నారనే విషయం ఈ ఫామ్‌‌‌‌ల ద్వారా తెలుస్తుంది. టీడీఎస్‌‌‌‌ ఎంత కట్ అయ్యిందో ఫామ్‌‌‌‌ 26ఏఎస్ ద్వారా ఉద్యోగులు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాక్స్ బ్రాకెట్ కంటే ఎక్కువ టీడీఎస్‌‌‌‌ను ఎంప్లాయర్లు కట్ చేస్తే రిఫండ్ కోసం 
అప్లయ్ చేయొచ్చు.

రెండు విధాలుగా..
 

టీడీఎస్‌‌‌‌పై లేట్‌‌‌‌ ఫీజును ఇలా లెక్కిస్తారు.. 

ఉదాహరణ1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌–జూన్‌‌‌‌) కి సంబంధించిన క్వార్టర్లీ టీడీఎస్‌‌‌‌ రిటర్న్‌‌‌‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌ 4 న రమేష్‌‌‌‌ అనే ట్యాక్స్‌‌‌‌పేయర్ ఫైల్ చేశాడని అనుకుందాం. ఈ క్వార్టర్‌‌‌‌‌‌‌‌కి గాను రూ. 8,40,000 టీడీఎస్‌‌‌‌ కింద ఆయన కట్టారు.  
కానీ, ఏప్రిల్‌‌‌‌–జూన్‌‌‌‌, 2022 కి సంబంధించి చివరి తేది జులై 31 తోనే పూర్తవ్వడంతో టీడీఎస్‌‌‌‌ రిటర్న్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేయడంలో ఆయన  247 రోజులు వెనకబడ్డారు. లేటు ఫీజుకింద రూ. 49,400 (247 X రూ.200) కట్టాల్సి ఉంటుంది. ఈ  లేట్‌‌‌‌ ఫీజు మొత్తం టీడీఎస్‌‌‌‌ క్లయిమ్ అమౌంట్‌‌‌‌ కంటే తక్కువ కాబట్టి పైన పేర్కొన్న ట్యాక్స్‌‌‌‌పేయర్‌‌‌‌‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌కు ముందే  రూ. 49,400  కట్టాల్సి ఉంటుంది. కాగా, టీడీఎస్‌‌‌‌ను క్లయిమ్‌‌‌‌ చేసుకోకపోతే మొత్తం ట్యాక్స్ లయబిలిటీ నుంచి టీడీఎస్ డిడక్ట్‌‌‌‌ కాదు. అప్పుడు ట్యాక్స్ భారం పెరుగుతుంది. 

ఉదాహరణ2:  పైన పేర్కొన్న రమేష్ ఈ సారి జులై–సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌కి గాను రూ. 8,400 మాత్రమే టీడీఎస్‌‌‌‌ కింద కట్టారని అనుకుందాం. టీడీఎస్ రిటర్న్‌‌‌‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌ 4 న ఫైల్ చేస్తే, ఆయన 155 రోజులు వెనకబడినట్టు లెక్క.  అప్పుడు లేటు ఫీజు కింద రూ. 31 వేలు కట్టాల్సి ఉంటుంది.
క్లయిమ్ చేసుకుంటున్న టీడీఎస్ (రూ. 8,400),  లేటు ఫీజు కంటే చాలా తక్కువ. దీంతో లేటు ఫీజు కింద కేవలం రూ. 8,400 కడితే సరిపోతుంది.  కానీ, టీడీఎస్ డిడక్షన్‌‌‌‌ మొత్తాన్ని లేట్‌‌‌‌ ఫీజు కింద కోల్పోవలసి వస్తుంది.