సిరిసిల్లలో టీ కొట్టు తొలగింపుపై లొల్లి

సిరిసిల్లలో టీ కొట్టు తొలగింపుపై లొల్లి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల బతుకమ్మ ఘాటు వద్ద ఉన్న టీ కొట్టు తొలగింపుపై లొల్లి నడుస్తోంది. రెండు రోజుల కింద సిరిసిల్ల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా పర్యటన సందర్భంగా బతుకమ్మ ఘాటు వైపు వెళ్లారు. అక్కడ ఉన్న టీ కొట్టుకు కేటీఆర్ బొమ్మ ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని, దాన్ని తొలగించాలని మున్సిపల్ ఆఫీసర్లను ఆదేశించడంతో ఫొటో తొలగించారు. ఫొటో తొలగింపు ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాగా టీ స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైసెన్స్ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని అధికారులు శుక్రవారం సాయంత్రం టేలాను తొలగించారు. దీంతో టీ కొట్టు నిర్వాహకుడు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భార్యాపిల్లలతో మున్సిపల్ ఆఫీస్ ముందు రోధిస్తూ నిరసన తెలిపాడు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొమ్మ పెట్టుకోవడం వల్లే అధికారులు తన టీ స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలగించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది.  అతనికి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు మద్దతు తెలిపారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫోన్ మాట్లాడించగా.. రమేశ్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చినట్లు లీడర్లు తెలిపారు.