- చితకబాది పోలీసులకు అప్పగించిన పేరెంట్స్
- నిందితుడిపై పోక్సో కేసు
యాదాద్రి, వెలుగు : స్టూడెంట్‌కు అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్న టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది. భువనగిరిలోని ప్రైవేట్ స్కూల్లో సంజయ్ కుమార్ సైన్స్టీచర్గా పని చేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న తన స్టూడెంట్‌కు సెల్‌ఫోన్ లో అసభ్యకర మెసేజ్‌లు పంపించడం ప్రారంభించాడు. దీంతో పాటు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు తన పేరేంట్స్‌కు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన పేరెంట్స్.. స్కూల్‌కు వెళ్లి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంజయ్ కుమార్‌ను చితకబాదారు. అనంతరం భువనగిరి టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్కూల్ కు చేరుకుని సంజయ్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.