మానసిక ప్రవర్తన సరిగా లేని టీచర్ నిర్వాకం
మెదక్ జిల్లా కొల్చారం ప్రైమరీ స్కూల్ లో ఘటన
కొల్చారం, వెలుగు: ఓ ప్రైమరీ టీచర్ మానసిక ప్రవర్తన సరిగా లేక స్కూల్ లో తోటి టీచర్లను తిడుతూ.. స్టూడెంట్స్ ను కొడుతున్న ఘటన మెదక్ జిల్లా కొల్చారంలో ఆలస్యంగా తెలిసింది. గ్రామస్తులు, స్కూల్టీచర్లు తెలిపిన ప్రకారం.. స్థానిక ప్రైమరీ స్కూల్లో డ్యూటీ చేసే టీచర్సంపత్ అనారోగ్యంతో బాధపడుతుండగా మానసిక ప్రవర్తన సరిగా లేదు. కొద్ది రోజులుగా స్కూల్ స్టూడెంట్స్ను అకారణంగా కొడుతున్నాడు. సోమవారం అక్షిత్ కుమార్ అనే విద్యార్థి రెండు చెవులను పట్టుకుని లేపి కింద పడేశాడు.
దీంతో విద్యార్థి భయంతో క్లాస్ లోనే మూత్రం పోసుకొని సొమ్మ సిల్లి పడిపోయాడు. విద్యార్థి తండ్రి మేదరి నరసింహులుకు తెలపగా వెంటనే స్కూల్ కు వెళ్లి.. తన కొడుక్కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని, దీంతో టీచర్ ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు కూడా పలువురు స్టూడెంట్స్ను సంపత్ కొట్టాడని గుర్తు చేస్తూ బాధిత తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్టూడెంట్స్ను ఇష్టమొచ్చినట్టు కొడుతుండగా.. టీచర్సంపత్ ను అడిగితే.. తమను కూడా బూతులు తిడుతున్నారని తోటి మహిళా టీచర్లు వాపోయారు.
ఆయన ప్రవర్తనతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్తల్లిదండ్రులు, టీచర్లు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో సత్యనారాయణను వివరణ కోరగా టీచర్సంపత్వ్యవహారంపై ఎంక్వైరీ చేస్తున్నామని, ఉన్నతాధికారులకు రిపోర్ట్పంపి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీచర్సంపత్ ను కూడావివరణ కోరేందుకు ఫోన్ లో ప్రయత్నిస్తే స్విచ్ఛాఫ్ ఉంది.