స్టూడెంట్​ నిద్ర లేవలేదని తల పగలగొట్టిన టీచర్​

  •     తుంగతుర్తిలో ఘటన 

తుంగతుర్తి, వెలుగు :  సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని మైనార్టీ గురుకుల స్కూల్​లో శుక్రవారం ఉదయం ఓ స్టూడెంట్​ నిద్ర లేవలేదని టీచర్​ అతడి తల పగలగొట్టాడు. గురుకులంలో సిరాజ్​అనే స్టూడెంట్​ 6వ తరగతి చదువుతున్నాడు. ఉదయం ఆరు గంటలకు టీచర్ ​జానీ స్టూడెంట్లందరినీ నిద్ర లేపడానికి వెళ్లాడు. సిరాజ్​ లేవకపోవడంతో అతడి తలపై కట్టెతో కొట్టగా గాయపడ్డాడు.

ALSO READ: వాయుసేన​లోకి మరో 12 సుఖోయ్​లు.. కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం

తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది సిరాజ్​ను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ఉమారెడ్డిని వివరణ కోరగా ఘటనపై ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామన్నారు.