
అతివేగం..ర్యాష్ డ్రైవింగ్..కాలయముడిలా దూసుకొచ్చిన కారు..రోడ్డుకు అంతదూరంలో నిలుచున్నా వదల్లేదు..అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి.. ఉన్నట్టుండి టప్ మని శబ్ధం..గాల్లో కెగిరి పల్టీలు కొడుతూ దాదాపు వందమీటర్ల దూరంలో పడిపోయాడు..పైపైనే ప్రాణాలు గాల్లో కలిశాయి. బాడీ చలనం లేకండా పడిపోయింది..అక్కడున్న వారంతా షాక్.. ఏంజరిగిందని.?
#JUSTIN சேலம் ; பூலாம்பட்டி அருகே சாலையோரம் நின்றிருந்த ஆசிரியர் மீது அதிவேகமாக வந்த கார் மோதி உயிரிழப்பு
— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) March 29, 2025
விபத்தின் சிசிடிவி காட்சி#Salem #Poolampatti #Accident #CCTV #News pic.twitter.com/A8v04xbjBd
శనివారం (మార్చి 29) తమిళనాడులో సాలెం ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డు పక్కన బైక్పై ఉన్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు వేగానికి ఆ వ్యక్తి దాదాపు 30 అడుగుల ఎత్తుకు ఎగిరి దాదాపు100 మీటర్ల దూరంలో పడిపోయాడు. పడినోడు మళ్లా లేవలేదు.గాల్లో ఉండగానే ప్రాణాలు పోయాయి. క్షణాల్లో జరిగిన ఈ విషాద ఘటన చూసిన అక్కడి వారంతా ఏం జరిగిందో తెలియక కొన్ని నిమిషాలపాటు షాక్ లో ఉన్నారు. తేరుకొని డెడ్ బాడీని చూసి బోరున విలపించారు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ALSO READ | హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం
ఆ వీడియోలో ఒక టీచర్ అని చెప్పబడుతున్న ఆ వ్యక్తి రోడ్డు పక్కన ఒక మహిళతో నిలబడి ఉండగా వెనుక నుండి ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తుంది. టీచర్ గాల్లోకి ఎగిరి రోడ్డు పక్కన పడతున్న దృశ్యాలు సినిమా యాక్సిడెంట్ సీన్లను తలపించింది. కారు డ్రైవర్ కంట్రోల్ తప్పి ఆ టీచర్ ను ఢీకొట్టి పారిపోయినట్లు సీసీకెమెరా ఫుటేజీలో కనిపిస్తోంది.