క్లాస్‌‌‌‌రూంలో పాఠాలు చెబుతూ..గుండెపోటుతో టీచర్ మృతి

క్లాస్‌‌‌‌రూంలో పాఠాలు చెబుతూ..గుండెపోటుతో టీచర్ మృతి
  • భద్రాద్రి జిల్లా ఇల్లందు హైస్కూల్‌‌‌‌లో ఘటన

ఇల్లెందు, వెలుగు : ఓ ప్రభుత్వ టీచర్‌‌‌‌ క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లో పాఠాలు బోధిస్తూనే గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లందులో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌‌‌‌కు చెందిన రమేశ్‌‌‌‌ (49) ఖమ్మంలోని టీచర్స్‌‌‌‌ కాలనీలో ఉంటూ, ఇల్లందు పట్టణంలోని జేబీఎస్‌‌‌‌ హైస్కూల్‌‌‌‌లో ఫిజిక్స్‌‌‌‌ టీచర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. 

సోమవారం స్కూల్‌‌‌‌కు వెళ్లిన రమేశ్‌‌‌‌ ఉదయం క్లాస్‌‌‌‌కు వెళ్లి స్టూడెంట్స్‌‌‌‌కు పాఠాలు చెబుతున్నాడు. ఈ క్రమంలో ఛాతీలో నొప్పి రావడం అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన సిబ్బంది వెంటనే ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. రమేశ్‌‌‌‌ మృతి పట్ల టీచర్లు, స్టూడెంట్లు సంతాపం తెలిపారు.