హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) ఎగ్జామ్స్ మొదలయ్యాయి. తొలిరోజు గురువారం మార్నింగ్ సెషన్లో సోషల్ స్టడీస్ అభ్యర్థులకు 49 పరీ క్ష కేంద్రాల్లో ఎగ్జామ్(పేపర్ 2) జరిగింది. 12,815 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 9,259(72.25 శాతం) మంది హాజరయ్యారు. ఆఫ్టర్ నూన్ సెషన్లో 52 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. దీనికి 12,734 మందికి గానూ.. 9637 (75.68%) అటెండ్ అయ్యారు.
అయితే, ఉదయం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జనగామ, జగిత్యాల, గద్వాల జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఎగ్జామ్ జరిగింది. మధ్యాహ్నం కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీమ్, వికారాబాద్ జిల్లాల అభ్యర్థులకు పరీక్ష జరిగింది. కాగా..దూరప్రాంతాల్లో సెంటర్లు పడటంతో.. ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు పరీక్షలు రాయలేదని తెలుస్తోంది.