ఖమ్మం జిల్లాలో టెట్ ఎగ్జామ్ ప్రశాంతం

ఖమ్మం జిల్లాలో  టెట్ ఎగ్జామ్ ప్రశాంతం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టెట్(టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్) ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగిగాయి. ఖమ్మం జిల్లాలో పేపర్–-1 ఎగ్జామ్ 54 సెంటర్లలో, పేపర్–2 ఎగ్జామ్ 45 సెంటర్లలో నిర్వహించారు. ఉదయం12,923 మందికి గాను 10,465 మంది అభ్యర్థులు ఎగ్జామ్ ​రాశారు. 2,458 మంది పేపర్–1 ఎగ్జామ్​రాయలేదు. మధ్యాహ్నం 10,480 మందికి గాను 9,528 మంది ఎగ్జామ్​రాశారు. 952 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఎగ్జామ్​సెంటర్లను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, అడిషనల్ కలెక్టర్ డి.మధుసూధన్ నాయక్, జిల్లా అబ్జర్వర్​ ఎస్.సత్యనారాయణ, డీఈఓ సోమశేఖరశర్మ తనిఖీ చేశారు. అలాగే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పేపర్–--1 ఎగ్జామ్ 37 సెంటర్లలో, పేపర్–-2 ఎగ్జామ్ 29 సెంటర్లలో నిర్వహించారు. 

ALSO READ: అక్క పుట్టిన రోజునే యాక్సిడెంట్.. చెల్లి మృతి

ఉదయం 8,717 మందికి గాను 7,307 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1,410 మంది ఎగ్జామ్​రాయలేదు. మధ్యాహ్నం 6,661మందికి గాను 6,131 మంది ఎగ్జామ్​రాశారు. 952 మంది ఆబ్సెంట్​ అయ్యారు. జిల్లా కలెక్టర్​ ప్రియాంక లక్ష్మీదేవిపల్లి కృష్ణవేణి కాలేజీలోని సెంటర్​ను తనిఖీ చేశారు. పాల్వంచలోని సెంటర్లను ఎంఈఓ శ్రీరాంమూర్తి పరిశీలించారు. చాలా చోట్ల అభ్యర్థులు చంటి పిల్లలతో వచ్చారు. పిల్లలను సహాయకులకు ఇచ్చి ఎగ్జామ్ సెంటర్​లోకి వెళ్లారు.    

 - వెలుగు, భద్రాచలం/పాల్వంచ రూరల్/ఖమ్మంటౌన్