- జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణ
- పేపర్1 నాలుగు రోజులు.. పేపర్ 2కు 6 రోజులు కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పది రోజుల పాటు ప్రతి రోజు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరగనున్నాయని శుక్రవారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మే 20 నుంచి 30 వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు ఆరు రోజులు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది.
మే 20, 21, 22 తేదీల్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్‌కు, 24, 28, 29 తేదీల్లో సోషల్ స్టడీస్ పేపర్‌కు ఎగ్జామ్ జరగనుంది. అలాగే, మే 30 నుంచి జూన్ 2 వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు టెట్ పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో మైనర్ మీడియం అభ్యర్థులకు జూన్ 1 మార్నింగ్ సెషన్‌లో, పేపర్ 1 మైనర్ మీడియం అభ్యర్థులకు మధ్యాహ్నం సెషన్‌లో పరీక్ష ఉండనుంది.