హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రిలిమినరీ కీని ఈనెల 24న రిలీజ్ చేస్తామని టీజీ టెట్ చైర్మన్ నర్సింహారెడ్డి వెల్లడించారు. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 27 సాయంత్రం 5 గంటల లోపు పూర్తి ఆధారాలతో https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లింకు ద్వారా పంపించాలని సూచించారు.
ఈనెల 2న ప్రారంభమైన టెట్ పరీక్షలు సోమవారంతో పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,75,753 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 2,05,278 (74.44%) మంది హాజరయ్యారు. పేపర్ 1కు 69,476 మంది, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 69,390 మంది హాజరయ్యారు.