టీచర్‌‌ను చంపిన మావోయిస్టులు

టీచర్‌‌ను చంపిన మావోయిస్టులు
  • మూతపడిన స్కూల్‌‌ను రీఓపెన్‌‌ చేసినందుకే హత్య చేశారన్న ఎస్పీ

భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు ఓ టీచర్‌‌ను తీవ్రంగా కొట్టి, ఉరి వేసి చంపేసిన ఘటన చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగింది. సుక్మా ఎస్పీ కిరణ్‌‌ చౌహాన్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... మావోయిస్టుల భయంతో సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోని గొందిపల్లిలో ఉన్న స్కూల్‌‌ గతంలో మూతబడింది. అయితే అక్కడ పనిచేసే టీచర్‌‌ దుద్ది అర్జున్‌‌ స్కూల్‌‌ను తిరిగి ఓపెన్‌‌ చేయించారు. ఈ కారణంతో మావోయిస్టులు అర్జున్‌‌ను తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి, ఉరి వేసి చంపేశారని ఎస్పీ తెలిపారు.