తెలుగు టీచర్ అయ్యుండి ఈ పనులేంటయ్యా..

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్.. అందులోనూ మన సంస్కృతీ సంప్రదాయాలను తెలుగు బాషా ఉపాద్యాయుడు అయ్యుండి కీచకుడిలా ప్రవర్తించిన టీచర్ కు చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పారు పేరెంట్స్. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి..మంచిర్యాల మార్కెట్ లోని జడ్పి గర్ల్స్ హైస్కూల్ లో తెలుగు పండిట్ గా పనిచేస్తున్న సత్యనారాయణ స్టూడెంట్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో... ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పారు. స్కూల్ గోడ దూకి పారిపోతున్న అతడిని వెంటాడి పట్టుకొని నడిరోడ్డుపై చితకబాదారు. 

గ్రేడ్ 2 పండిట్ అయిన సత్యనారాయణ ఇటీవల తెలుగు పండిట్ గా ప్రమోషన్ పొందారు. ఆయనకు మంచిర్యాల గర్ల్స్ హైస్కూల్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఆరు, ఏడు క్లాస్ లకు టీచింగ్ చేస్తున్నాడు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మొబైల్ లో వారి ఫోటోలు తీసుకుంటున్నాడు. అంతేగకుండా దొంగచాటున పలువులు మహిళా టీచర్ల ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నాడు. అయన ప్రవర్తన గురించి స్టూడెంట్లు, టీచర్లు హెడ్ మాస్టర్ పద్మావతికి ఫిర్యాదు చేయగా, ఆమె డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆరోపణలపై ఎంఈవో మాళవిదేవిని మంగళవారం స్కూల్ లో విచారణ చేశారు. 

స్టూడెంట్లు, టీచర్ల స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన డీఈవోకు అందజేశారు. ఈ మేరకు సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ డీఈవో యాదయ్య ఆర్డర్స్ జారీ చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న పలువురు తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి సత్యనారాయణను నిలదీశారు. ఆయన గోడదూకి పారిపోతుండగా వెంబడించి మార్కెట్ రోడ్ లో పట్టుకొని చెప్పులతో కొట్టారు. తప్పయింది.. క్షమించాలని వేడుకోవడంతో వదిలిపెట్టారు. ఈ విషయమై డీఈవో యాదయ్యను వివరణ కోరగా... సత్యనారాయణ స్టూడెంట్లు, టీచర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు రుజువుకావడంతో సస్పెండ్ చేశామన్నారు.