దుస్తులు విప్పి..చేతులతో తడుముతూ..ఓ టీచర్​ వికృత చేష్టలు

  • చాక్లెట్స్ ఆశచూపి 3వ తరగతి స్టూడెంట్లతో అసభ్య ప్రవర్తన
  • వివరాలు బయట పెట్టిన ఓ విద్యార్థిని 
  • పీఎస్​ ఎదుట పేరెంట్స్​ ఆందోళన 
  • పోలీసుల అదుపులో టీచర్
  • మరో 4 నెలల్లో రిటైర్ మెంట్ 
  • యాదాద్రి జిల్లా గుండాల ప్రైమరీ స్కూల్​లో ఘటన  

మోత్కూరు, వెలుగు : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ధి దారి తప్పింది. కొంతకాలంగా మనవరాళ్ల వయస్సున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చాక్లెట్స్ ఇస్తానని ఆశచూపి వికృత చేష్టలకు దిగడంతో ఓ విద్యార్థిని అతడి గుట్టు బయటపెట్టింది. దీంతో కీచక టీచర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పేరెంట్స్, స్టూడెంట్స్​కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల ప్రైమరీ స్కూల్​లో 25 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. అండెం మాధవరెడ్డి, నాగరాజు ఇక్కడి టీచర్లు. ఇందులో మాధవరెడ్డి ఏడాదిగా 3వ తరగతి చదువుతున్న ఆరుగురు స్టూడెంట్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చాక్లెట్స్ ఇస్తూ క్లాస్​ రూంలో  బట్టలు విప్పి చేతులతో తడుముతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. 

ఎవరైనా బయటకు చెబుతారని అనుమానం వస్తే కొట్టి భయపెడుతున్నాడు. చేతి వేళ్ల మధ్య కర్ర పెట్టి మెలి తిప్పుతూ బెదిరిస్తున్నాడు.  ఈ క్రమంలో ఓ విద్యార్థిని స్కూల్​కు వెళ్లడం మానేసింది. పేరెంట్స్ ఆరా తీయగా టీచర్ చేష్టల గురించి చెప్పింది. దీంతో మిగిలిన స్టూడెంట్స్​ తల్లిదండ్రులకు చెప్పగా వారు తమ పిల్లలను ఆరా తీశారు. వారు కూడా జరిగిందంతా చెప్పారు. ఆగ్రహించిన పేరెంట్స్​ స్కూల్ కు వెళ్లగా అప్పటికే టీచర్ మాధవరెడ్డి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో పిల్లలను తీసుకొని పీఎస్​కు వెళ్లి ఆందోళన చేశారు. మాధవరెడ్డిపై ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని, పోక్సో కేసు పెట్టామని ఎస్సై యాకయ్య తెలిపారు. టీచర్ మాధవరెడ్డి మరో నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. టీచర్​కు దూరపు బంధువైన ఓ పొలిటికల్​ లీడర్​ విషయాన్ని పెద్దది చేయకుండా చూడాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.