విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సక్రమమైన దారిలో పెట్టాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ లో చోటుచేసుకుంది. అత్తాపూర్ లోని ఎస్ఆర్ డిజి స్కూల్ లో విష్ణు అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు.
అయితే గత కొద్ది రోజులుగా విష్ణు.. ఆ స్కూల్ లో 8 తరగతి చదువుతోన్న విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడంతో విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ కు చేరుకుని దాడికి దిగారు.
స్కూల్ లో ఉన్న ఫర్నీచర్, కంప్యూటర్ రూమ్ ను పగలగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పీఈటీ టీచర్ ఫొన్ స్వీచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. విద్యార్థిని తల్లిదండ్రులు పీఈటీ టీచర్ పై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.